ప్రశాంతంగా గురుకుల ఎంట్రెన్స్

29-04-2024 01:12:06 AM

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 2024 విద్యాసంవ త్సరానికి అడ్మిషన్ల కోసం 18,989 మంది దరఖాస్తులు చేసుకోగా పరీక్షకు 16,564 మంది విద్యార్థులు హాజరయ్యారని బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 272 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లోని సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 88.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం 47,463 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 41,775 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఆయన వెల్లడించారు.