25 April, 2026 | 2:12 AM

కాచాపూర్‌లో చలివేంద్రం ప్రారంభం

25-04-2026 12:43 AM

భిక్కనూర్, ఏప్రిల్24(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.