పెద్దమల్లారెడ్డిలో చలివేంద్రం ప్రారంభం
25-04-2026 12:42 AM
భిక్కనూర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు మాధవరెడ్డి, అనిల్, ఎల్లం రాజు, ఈర సాహితీ స్వామి, నట్టలింగం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






