ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
06-04-2026 06:40 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన కూడలి నందు సోమవారం బూర్గంపాడు గ్రామ సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పలు గ్రామాల నుంచి ప్రయాణికులు వస్తుంటారని వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ బర్ల ప్రభాకర్,పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు




