29 August, 2026 | 4:15 AM

వేసవిలో తాగు నీటి సరఫరా భేష్

21-05-2024 01:50 AM

అధికారులకు మంత్రి సీతక్క అభినందన

హైదరాబాద్, మే 20 ( విజయక్రాంతి): వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగు నీటి సరఫరా చేయడం పట్ల పంచాయితీరాజ్, మిషన్ భగీరథ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయయంలో పీఆర్,ఆర్డీ, మిషన్ భగీరథ అధికారులతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తాగు నీటి సరఫరాలో అధికారుల పనితీరు అభినందనీయమని ప్రశింసించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పని తీరు ప్రదర్శించాలని కోరారు. వానకాలంలో తాగు నీరు కలుషితం కాకుండా, డ్రైనేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామ పంచాయితీల్లో శానిటేషన్‌పై జాగ్రత్తగా ఉండాలని, డ్రైనేజీలు, రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.