29 August, 2026 | 1:12 AM

కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విరక్తి

21-05-2024 01:54 AM

ఆరు గ్యారెంటీల్లో అమలైంది ‘ఉచిత బస్సు’ ఒక్కటే

ఓటర్లను డబ్బుతోకొనేందుకు కాంగ్రెస్ కుట్ర

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత ఈటల రాజేందర్

సూర్యాపేట, మే 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే విరక్తి పు ట్టిందని, ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామనే ఆ లోచనలో ఉన్నారని బీజేపీ నేత, మాజీ మం త్రి ఈటల రాజేందర్ భాష్యం చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయకపోవడంపై ప్రజల్లో అసహనం నెలకొందని అన్నారు. వరంగల్  ఖమ్మం  నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీజేపీ నేత బీబీ పాటిల్‌తో కలిసి సూర్యాపేట జిల్లాలో ఈటల పర్యటించారు.

కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఈటల ప్రసంగించారు.  వైద్యశాఖ అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని అన్నారు. కనీసం మం దులు కొనే పరిస్థితిలో కాంగ్రెస్ సర్కారు లేదని ఎద్దేవా చేశారు.  పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను కొనుగోలు చేయడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బుతో గెలిచేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. అసలు కాంగ్రెస్‌కు ఎం దుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై పోరాడే బీజే పీకే ఓటు వేయాలని ఈటల పిలుపునిచ్చా రు.  ఈ కార్యక్రమంలో నాయకులు శానంపుడి సైదిరెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి, బొబ్బా భాగ్యరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.