బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి
27-04-2026 12:06 AM
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 26 : బస్సు ఆపలేదనే కారణంతో బస్సు డ్రైవర్ పై ఒక వ్యక్తి దాడికి దిగిన ఘటన ఆదివారం నల్లగొండలో జరిగింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో ఐటీ హబ్ ఎదురుగా బస్టాప్ వద్ద ఆగిన ఆర్టీసీ బస్ డ్రైవర్ తాళ్ల రామ్ కుమార్ పై మధ్యలో బస్సు ఆపలేదని తుపాకుల వెంకటేశం అనే ప్రయాణికుడు బస్ డ్రైవర్ పై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించాడన్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్ ఎస్త్స్ర సైదా బాబా తెలిపారు. కాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






