calender_icon.png 24 November, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శామీర్‌పేట్‌ ఓఆర్ఆర్పై ఘోరప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

24-11-2025 08:21:12 AM

మేడ్చల్: శామీర్‌పేట్‌ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై(Shamirpet ORR) సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉన్న ఎకో స్పోర్ట్స్ కారులో( EcoSport) ఆకస్మాత్తుగా మంటలలు చెలరేగాయి. కారు నుంచి డ్రైవర్ బయటకు రాలేకపోవడంతో సజీవదహనం అయ్యాడు. శామీర్‌పేట్‌ నుంచి కీసర(Shamirpet to Keesara) వెళ్తుండగా లియోనియా రిసార్ట్స్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సందర్భంగా ప్రయాణికులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

🔸 అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

🔸 సురక్షితమైన దూరం నిర్వహించండి.

🔸 అటువంటి సంఘటనలను నివారించడానికి మీ వాహన పరిస్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

🔸 ట్రాఫిక్, అత్యవసర సిబ్బంది సూచనలను అనుసరించండి.