calender_icon.png 24 November, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

24-11-2025 01:22:10 AM

-కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

-మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక కార్యాచరణ 

-భూపాలపల్లి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇచ్చాం

-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), నవంబర్ 23 (విజయక్రాంతి): మహి ళా సాధికారతే IT, Industries and Legislative Affairs Department says it is the state government's goal మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పం పిణీ చేస్తున్నామని తెలిపారు.

ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఎస్‌ఆర్ గార్డెన్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా గ్రామీణ అభి వృద్ధి శాఖ అధ్వర్యంలో మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు, మహిళలకు ఇందిరమ్మ చీరలను మంత్రి శ్రీధర్‌బాబు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళల పేర్ల మీదనే ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేస్తున్నామని, 3,500 ఇళ్లను భూపాలపల్లి నియోజకవర్గంలో మహిళలకు అందించామని చెప్పారు.

గృహ జ్యోతి పథ కం ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నాని స్పష్టంచేశారు. ప్రభు త్వ పరంగా మహిళల పేరునే అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామని, మీ అందరి ఆశీర్వా దం ప్రభుత్వంపై ఉండాలని మంత్రి కోరా రు. గ్రామీణ ప్రాంతాల మహిళలతో పాటు వచ్చే నెల రోజుల్లో పట్టణ ప్రాంత మహిళలకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని అన్నారు.

ఇచ్చిన హామీలను ఒకటి తరువాత ఒకటి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రో త్సహించడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

ఈ కా ర్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యుడు రమేష్, మహిళా సమాఖ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సరిత, సుమలత పాల్గొన్నారు.