24-11-2025 08:38:55 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి(CM Revanth Reddy Delhi Tour) చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం(Justice Surya Kant To Take Oath ) చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుని తన నియోజకవర్గం కొడంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం కొడంగల్ లో అక్షయ పాత్ర ఇంటిగ్రేటెడ్ కిచెన్ ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం కొడంగల్ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.