27 April, 2026 | 7:49 AM

డీఆర్వో మేడం.. మమ్మల్ని క్షమించండి

03-12-2024 02:17 AM

రత్నకల్యాణిని కోరిన దిలువార్‌పూర్ మహిళా రైతులు

నిర్మల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): దిలువార్‌పూర్ మండల కేంద్ర వద్ద ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ధర్నాలో ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన డీఆర్వో రత్నాకల్యాణిని కారులో నిర్బంధించిన విషయం తెలిసిందే. దీంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సోమవారం రత్నాకల్యాణిని కలిసిన నాలుగు గ్రామాల మహిళా రైతులు తమను క్షమించాలని కోరారు. అనంతరం ఆమెను సన్మానించారు.

నిర్భందం చేయడం తమను ఎంతగానో బాధించిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశంలో తాము చేసిన తప్పును క్షమించాలని కోరారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. బాధలో ఉన్న ఆవేశంతో తనను నిర్బంధించారని అర్థం చేసుకున్నాని తెలిపారు. సమస్యను పరిష్కరించడం అధికారులగా తమ బాధ్యత అని ఆమె చెప్పారు.