దుబాయ్ అల్ బదా వద్ద డ్రోన్ దాడి
గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగింపు
బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలోనూ ఘటనలు
దుబాయ్, మార్చి 12: యూఎస్ యెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యు ద్ధంతో పశ్చిమాసియాలో భీకర పోరు నడు స్తోంది. 13వ రోజైన గురువారం కూడా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిం చింది. దుబాయ్‌లోని అల్ బదాప్రాంతంలో డ్రోన్ పడిన ఘటన చోటుచేసుకున్నట్లు అధి కారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయప డలేదని దుబాయ్ ప్రభుత్వ మీడి యా గురువారం వెల్లడించింది. ఘటన సమయంలో నగర కేంద్రప్రాంతంలో పేలు ళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇరాన్ దాడుల్లో భాగంగా పర్షి యన్ గల్ఫ్ సముద్రంలో దుబాయ్ తీరానికి సమీపంలో ఒక కంటైనర్ నౌకపై కూడా డ్రోన్‌శకలం తాకి చిన్న మంటలు చెలరేగి నట్లు బ్రిటన్ నౌకాయాన పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. నౌకలోని సిబ్బంది సురక్షితం గా ఉన్నట్లు సమాచారం. బహ్రెయిన్‌లో ముహర్రాక్ దీవిలో జరిగిన ఇరాన్ దాడితో పెద్ద అగ్నిప్రమాదం సంభ వించింది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్ర యం సమీపంలో జెట్ ఇంధన ట్యాంకులు ఉండటంతో అధికా రులు అప్రమత్తమయ్యా రు. కువైట్‌లో ఒక నివాస భవనాన్ని డ్రోన్ ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు.
జెరూసలేం సమీపంలో క్షిపణి దాడి
గురువారం ఇరాన్ రాకెట్ల దాడిలో జెరూ సలేం వైపు ప్రయోగించిన క్షిపణి టెంపుల్ మౌంట్ నుంచయి కొన్ని వందల మీటర్ల దూరంలో పడిపోయిందని ఇజ్రాయెల్ విదే శాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వెస్ట్రన్ వా ల్, అల్-అక్సా మసీదు, హోలీ సెపల్చర్ చర్చి తో సహా అనేక పవిత్ర స్థలాల సమీపంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఆ ప్రదేశాల్లో ప్రార్థనలను తాత్కాలి కంగా నిలిపివేశారు.
జార్ లక్ష్యంగా హిజ్బుల్లా దాడి
లెబనీస్ సాయుధ సమూహం హిజ్బుల్లా తన యోధులు ఇజ్రాయెల్ స్థావరం ‘జార్’ ఇత్ వద్ద క్షిపణులను ప్రయోగించారని, ఈ దాడిని అనేక స్థావరాలకు జారీచేసిన విస్తృత హెచ్చరికలో భాగంగా అభివర్ణించా రు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గతం లో బెదిరింపుల తర్వాత ఈ దాడి జరిగిందని ఆ బృందం తెలిపింది.
ఇరాక్‌లో ఓడపై దాడి ఫుటేజీ విడుదల
ఇరాక్‌లోని ఓడపై దాడి చేసినట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ పేర్కొంది. ఈ ఓడపై దాడి వీడియోను విడుదల చేసింది. మార్షల్ దీవులలో జెండాతో ఉన్న సఫేసియా విష్ణు అనే ఓడను రాత్రిపూట పేలుళ్లు తాకినట్లు ఫుటేజ్‌లో ఉంది. ఈ ఫుటేజ్‌లో, ఒక వ్యక్తి ఫార్సీలో ఇలా అరు స్తున్నట్లు ఉంది.
‘అల్లాహ్ గొప్పవాడు! పర్షి యన్ గల్ఫ్‌లోని ఉత్తర జిల్లాలో ఒక అమె రికన్ ట్యాంకర్ నాశనం! నేను మీ మాట వింటాను! ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు శుభాకాంక్షలు! ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ నేవీ సైనికులారా!’ అని నినదించి నట్లు ఉంది. ఇరాన్‌పై యూఎస్ ఇజ్రాయె ల్ దాడులకు ఈయూ సహకారం అందిం చిందని ఇరాన్ ఆరోపించింది. ఈయూ కూటమి యూఎస్ దాడులకు వీలు కల్పిస్తోందని పేర్కొంది. దీంతో యూరప్ ప్రతిస్పందన దాడులకు మద్దతు ఇచ్చినట్లేనని ఇరాన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై పేర్కొన్నారు.




