calender_icon.png 28 January, 2026 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

28-01-2026 11:31:32 AM

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అజిత్ పవార్ దుర్మరణం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ప్రజానాయకుడని మోదీ కొనియాడారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. నిరుపేదల కోసం అజిత్ పవార్ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి(Maharashtra Deputy CM ) అజిత్ పవార్(66) బుధవారం దుర్మరణం పాలయ్యారు. బారామతి విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ తో మోదీ, అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. విమాన ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. 

మహారాష్ట్ర బారామతి వద్ద హోర విమాన ప్రమాదం(Plane crash) జరిగింది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ వెల్లడించింది. మృతుల్లో అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటల కు బారామతిలో ఘటన చోటుచేసుకుంది. జడ్పీ ఎన్నికల ప్రచారానికి ముంబయి నుంచి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 1959 జులై 22న మహారాష్ట్రలో అజిత్ పవార్ జన్మించారు. అజిత్ పవార్.. మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు. బారామతి నుంచి అజిత్ పవర్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బారామతి నుంచి వరసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆరుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సేవలందించారు. అజిత్ పవార్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.