12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

డ్రగ్స్ పై అవగాహన సదస్సు..

23-06-2025 07:58 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని గుడ్ షఫెర్డ్ విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సురేష్(SI Suresh) మాట్లాడుతూ.... డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. చాలామంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరు డ్రగ్స్ కు అలవాటు కావద్దు అని సూచించారు. 

విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ వహించి పట్టుదల క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకోని రావాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి మానవాళి మనుగడకు మొక్కలు చాలా అవసరం అని ప్రతి ఒక్కరు విధిగా తమ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ వై.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెభాస్టియన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.