కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత
ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు రూ. 2.5 లక్షల వి లువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చ ల్ పరిధిలోని గండిమైసమ్మ ప్రాం తంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద ఎండీఎంఏ రకం డ్రగ్స్ లభించాయని ఎస్‌టీఎఫ్ ఎస్సై పవన్ రెడ్డి పేర్కొన్నారు. వా హనంలోని టూల్‌కిట్ బాక్స్‌లో ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసిన డ్రగ్స్ క్రిస్టల్స్ లభించాయని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బెంగళూరు నుంచి కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న క్రాంతి, మహమ్మద్ షోయబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపా రు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






