22 August, 2026 | 7:02 AM

గ్రూప్ - 2, 3 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

12-06-2024 01:56 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూ ప్  2, 3 పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు జూన్ 18 నాటికి దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెంది న అభ్యర్థులు నాంపల్లిలోని హజ్‌హౌజ్ నందు ఉన్న 6వ అంత స్తులోని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం, అబిడ్స్‌లోని తెలంగాణ మైనార్టీస్ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూ చించారు. జూన్ 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పే ర్కొన్నారు. ఇతర వివరాలకు 040  నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.