22 August, 2026 | 12:25 AM

రాజాసింగ్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్టు

12-06-2024 01:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్న నిందితుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మహమ్మద్ వసీం(40)గా గుర్తించారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టకు చెందిన వసీం పదేళ్లుగా దుబాయిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజాసింగ్ ఫిర్యాదుతో గతే డాది నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమో దు చేసిన సీసీఎస్ పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశా రు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి వచ్చిన అతడిని ఇమ్మి గ్రేషన్ అధికారులు అదుపులోకి తీ సుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి, కోర్టులో హాజరు పరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.