విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి
12-06-2026 04:21 PM
- నేరేడుచర్ల ఎం.ఈ.వో. బాలు
నేరేడుచర్ల: పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల నందు మండల పరిధి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు.మధు,ఎల్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీ వారికి మధ్యాహ్న భోజన నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఈఓ ఎం బాలు మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం రుచికరంగా తయారుచేసి వడ్డించాలని, పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వంట సామగ్రి, వంటగది పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని మంచినీటి ట్యాంకుల శుభ్రతకోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు.






