17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

డ్రగ్స్‌నిర్మూలన అందరి బాధ్యత

24-06-2025 01:20 AM

జగిత్యాల, జూన్ 23 (విజయక్రాంతి): డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యతని, ఇందుకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాదక ద్రవ్యాల మహమ్మరిని నిర్ములించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థుల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సోమవారం స్థానిక మానస పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రాబోవు రోజుల్లో డ్రగ్స్ నిర్మూలించేది నేటి విద్యార్థులేనన్నారు. విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని, నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ వాడడం అనేది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడు చేస్తుందన్నారు.

ప్రమాదకర డ్రగ్స్ బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని, అందులో బాగంగా విద్యా సంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో సామూహికంగా ’మేము డ్రగ్స్ తీసుకోము, బంధు మిత్రులు, చుట్టుపక్కల వారు,

స్నేహితులు మాధక ద్రవ్యాలకు అలవాటు పడకుండా, వారిని చూసుకునే బాధ్యత మాదేనని, డ్రగ్స్ వల్ల కలి గే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం’ అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో డీఎస్పీ రఘుచందర్, ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్‌ఐ మల్లేశం పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ రావు, ప్రిన్సిపల్ రజిత, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులుపాల్గొన్నారు.