calender_icon.png 26 July, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల మౌలిక వసతుల కల్పనే ప్రజాప్రభుత్వ లక్ష్యం

24-06-2025 01:18:49 AM

  1. మండలాలను అనుసంధానం చేస్తూ నూతన డబల్ రోడ్డు నిర్మాణాలు

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి జూన్ 23( విజయ క్రాంతి): బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేసిందని,ప్రజల మౌలిక వసతుల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే విజయరమణ రావు విమర్శించారు.జిల్లా ఎలిగేడు మండల కేంద్రం నుండి గర్రెపల్లి వరకు 6 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే డబల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు గ్రామీణ రహదారులు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఎలిగేడు నుండి సుల్తాన్ పూర్ వరకు గర్రెపల్లి రోడ్డు వైపుగా రూపాయలు 6 కోట్ల నిధులతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు నాలుగు పోలీస్ స్టేషన్ లను ప్రారంభించుకున్నాం అలాగే త్వరలోనే సుగ్లంపల్లి నుండి ముప్పిరితోట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. నియోజకవర్గంలో ఏడాది లోపు గ్రామీణ రోడ్లు పూర్తి చేస్తాం అని తెలిపారు. గ్రామీణ ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సమా రాజేశ్వర్ రెడ్డి, దుగ్యాల సంతూష్ రావు, అర్షణాలి వెంకటేశ్వర్ రావు, కోరకంటి వెంకట్వశ్వర్ రావు, నర్హరీ సుధాకర్రెడ్డి, రమేష్ బాబు, బూర్ల సత్యం, సత్యనారాయణ, రమేష్, తిరుపతి, రాంచంద్రం రెడ్డి,rకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలుపాల్గొన్నారు.