calender_icon.png 17 November, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

17-11-2025 12:31:42 AM

ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల అర్బన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): మత్తులో వాహ నం నడపడం చట్ట విరుద్ధమే కాకుం డా సమాజానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, రోడ్డు ప్రమాదాల నివా రణకు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

గడిచిన 10 నెల ల్లో జిల్లా వ్యాప్తంగా 8686 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయ డం జరిగిందని మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై 304-II ఐపి సి సెక్షన్ కింద కేసులు బుక్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయడం జరుగుతుంన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిరంతరం నిర్వహిచడం జరుగుతుదని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.