17-11-2025 12:33:05 AM
ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
చొప్పదండి, నవంబరు 16 (విజయ క్రాంతి): గంగాధర మండలం నారాయణపూర్ నిర్వాసితుల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. నారాయణపూర్ నిర్వాసితులకు 23.50 కోట్ల రూపా యలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మే రకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన కృషి ఫలించింది.
దీంతో నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి(ఎన్) గ్రామాల్లో ముంపు బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గంగాధర మం డలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,బుచ్చన్న, రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, సత్తు కనుకయ్య, క ర్ర విద్యా సాగర్, తోట సంధ్య , కవిత, వేముల అంజి, బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, స్వామి, ది కొండ మధు, నగేష్, కొల ప్రభాకర్, మ్యాక వినోద్, మహేష్, తదితరులుపాల్గొన్నారు.