calender_icon.png 17 November, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి బోరింగ్ వద్ద అపరిశుభ్రత

17-11-2025 10:23:07 AM

చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు

చింతల మనెపల్లి,(విజయక్రాంతి): చింతల మనెపల్లి మండలం దిందా గ్రామంలోని త్రాగునీటి బోరింగ్ చుట్టూ మురుగు నీరు చేరి దుర్వాసన వాసిస్తోంది. బోరింగ్ ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో ప్రతిరోజూ త్రాగునీటి కోసం వచ్చే  పిల్లలు, గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర త్రాగునీటి గా ఉపయోగించే బోరింగ్ చుట్టూ మురికి పేరుకుపోయినా పంచాయతీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు బోరింగ్ వద్ద మురుగు నీటిని తొలగించి, పరిసరాలను శుభ్రపరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.