17-11-2025 10:25:02 AM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): సామాజిక న్యాయం లేకుంటే ప్రజాస్వామ్యం నశిస్తుందనే వాక్యం అది కేవలం దళితుల కోసమే కాదని భారతదేశంలోని ప్రతీ అణగారిన వర్గానికి, ప్రతి వెనుకబడిన కుటుంబానికి హక్కులు అందించాలనే భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సంకల్పమని బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 240వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఘట్ కేసర్ పట్టణంలో ఆదివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ అనేది ఎవరు ఇచ్చిన దానం కాదని, అంబేద్కర్ జ్ఞానం, ధైర్యం, నమ్మకం, అనునిత్యం చేసిన పోరాటం ఫలితంగా దేశానికి లభించిన శాశ్వత సామాజిక న్యాయం అన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇచ్చిన సామాజిక న్యాయ కోవిధుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబెడ్కర్ కోసం చేసే ప్రతి కార్యక్రమంలో నాసహాయ, సహకారాలు అందిస్తాం అని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, అవుషాపూర్ మాజీ సర్పంచ్ పి. రమేష్, మాజీ వార్డు సభ్యులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, నాయకులు కె. సుదర్శన్ రెడ్డి, ఇ. దయాకర్ రెడ్డి, వి. నాగరాజు చారి, కె. నర్సింగ్ రావు, జి. వినయ్ రెడ్డి, ఎండి బురాన్ సబ్, కె. సత్యం, ఎం. రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.