17-11-2025 10:26:29 AM
ఘట్‌కేసర్: క్రమశిక్షణ, పట్టుదలతో కృషిచేస్తే కూచిపూడి నాట్యంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అన్నారు. నాచారంలోని ఓ కాన్వెన్షన్ లో లహరి శ్రీనృత్య నికేతన్–కూచిపూడి డ్యాన్స్ అండ్ కర్ణాటక మ్యూజిక్ అకాడమీ 38వ వార్షికోత్సవ వేడుకలు నాట్య గురువు ఝాన్సీరాం ఆధ్వర్యంలో ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్లా రాధాకృష్ణ తో పాటు హెచ్ఆర్ మైండ్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి పంగివరపు రవికుమార్, సాంస్కృతిక బంధు కె. మాధవీలత, కురుకంటి కళాక్షేత్రం డైరెక్టర్ రాధిక ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఘట్ కేసర్ మున్సిపల్ ఎన్‌ఎఫ్‌సి నగర్‌కు చెందిన మోక్షధృతి అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరింపచేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు ప్రత్యేక పురస్కారంతో ఘనంగా సన్మానించారు. అత్యుత్తమప్రదర్శన ఇచ్చిన నృత్య కళాకారిణిగా ఎంపిక కావటంతో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డును మోక్షధృతి కి అందజేసి ఆమె తల్లిదండ్రులు ప్రవర్షి, శంకర్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కోర్టు సూపరిండెంట్ అంజనీకుమారి, నాచారం ఇంటలెక్చువల్ ఫోరం కో-కన్వీనర్ ఎం.వి. ప్రేమ్ కుమార్, బుల్లితెర సినీ నటులు పసునూరి శ్రీనివాసులు, అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.