12 July, 2026 | 3:11 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

తాగిన మత్తులో వ్యక్తి వీరంగం

11-08-2025 12:51 AM

 సీసాతో ముగ్గురిపై దాడి 

నిజామాబాద్ ఆగస్ట్ 10: (విజయ క్రాంతి):  మద్యం మత్తులో పూలుతున్న యువత విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. నిజామాబాద్ నగర శివారులోని  ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. నగరంలో మూడో డివిజన్‌లో ని గుపన్ పల్లి లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకు ంది. రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గూపన్‌పల్లిలో  శనివారం రాత్రి మదన్ మద్యం తాగి ఓ కిరాణా షాప్ ఎదుట నిద్రించాడు. 

కిరాణాదుకాణానికి అనిల్, శైలేందర్ వెళ్లగా.. శైలేందర్ కాలు మదన్‌కు తాకింది. అక్కడే గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన మదన్ పక్కనే ఉన్న కల్లుదుకాణంలోకి వెళ్లి కల్లుసీసా తీసుకొచ్చి పగులగొట్టి వారిరువురిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అనిల్ అక్క దీపికపై కూడా దాడి చేశాడు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనిల్‌కు కడుపులో తీవ్రంగా గాయం కావడంలో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు మదన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ అక్క దీపిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.