calender_icon.png 13 August, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆత్మగౌరవానికి రేషన్ కార్డు ప్రతీక

11-08-2025 12:53:07 AM

-కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్దిపేట, ఆగస్టు10 (విజయక్రాంతి): రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం ఎల్లారెడ్దిపేట మండల కేం ద్రంలోని మణికంఠ గార్డెన్స్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని, ఇ ది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు.

మండలంలో కొత్తగా 1,494 కార్డులు జారీ చేయగా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,999 మంది కుటుంబ సభ్యుల పేర్లు చేర్చినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 20,838 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు.ప్రతి కార్డుదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందుతుందని వివరించారు.రేషన్ కార్డు ఆధారం గా ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛన్, ఇతర సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుందని పేర్కొన్నారు. రేషన్ కార్డును ప్రభుత్వ పథకాల్లో భాగస్వామిగా ఉపయోగించుకోవాలని సూ చించారు.

రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే కాకుండా, ఆధార్ కార్డు, విద్యుత్ కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలులో కీలకమైన డాక్యుమెంట్గా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్ర మంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్దిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం,వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్,డెప్యూటీ తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.