ప్రెస్‌క్లబ్ నూతన కమిటీకి డీఎస్పీ అభినందనలు
10-07-2026 12:00 AM
వేములవాడ, జూలై 9, (విజయక్రాంతి): వేములవాడ ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గాన్ని డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ వీరప్రసాద్ సత్కరించి అభినందించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్థంభమ ని, వాస్తవాలను నిష్పాక్షికంగా ప్రజలకు చేరవేస్తూ బాధ్యతాయుత జర్నలిజంతో సేవ చేయాలని డీఎస్పీ సూచించారు. పోలీసు శాఖ మీడియా పరస్పర సహకారం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.






