17-10-2025 12:16:54 AM
పదర అక్టోబర్ 16. మండల కేంద్రంలో గురువారం పోలీస్ స్టేషన్ ను అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు తనిఖీ చేశారు. డిఎస్పికి ఎస్త్స్ర సద్దాం హుస్సేన్ పుష్పగుచ్చం అందిం చి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ...
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రా మాలలో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాలు అవశ్యకత గు రించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల రక్షణే ద్వేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అమ్రాబాద్ సీఐ రవీందర్ నాయక్, ఎస్త్స్ర సద్దాం హుస్సేన్, కాని స్టేబులు తదితరులుఉన్నారు.