17-10-2025 12:15:36 AM
పత్తి చేతికొచ్చినా కొనుగోలు చేయక ఆగం
అదును చూసి దండుకుంటున్న దళారులు
తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అధికారులు
నాగర్కర్నూల్ అక్టోబర్ 16 (విజయక్రాంతి):ఓ వైపు అధిక వర్షాలు, యూరియా కొరత, పంట తెగుళ్ళ కారణంగా పత్తి రైతు లు ఈ సీజన్ లో ఆగమవుతున్నారు. చివరకు చేతికోచ్చిన పంటను అమ్ముకుందా మన్నా కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతిలో చిత్తవుతున్నారు. మొదట సరైన వ ర్షాలు లేక భూమిలోనే కుళ్ళిపోయిన విత్తనాలను అధిక ఖర్చుతో మరోసారి నాటుకోగా వరుస వర్షాలతో పత్తి పంట తెగుళ్ల బారిన పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కూడా పత్తి రైతులను తీవ్ర నిరాశపరిచింది. చివరికి పంట చేతికొచ్చినా కూలీల కొరత కారణంగా అప్పుల ఊబిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని పత్తి రైతులు మధనపడుతున్నారు. చివరకు చేతికొచ్చిన పత్తిని అమ్ము కుందామన్నా ప్రభుత్వం సీసీఐ (కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించక రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారు.
ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ దుకా ణాలలో విత్తనాలు ఎరువులు కొనుగోలు చే యడంతో వారితో పాటు మరికొందరు ద ళారుల అవతారమెత్తి రైతుల నుండి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల వారిగా ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,81,466 ఎకరాల్లో పత్తి సాగు చేయగా సుమారు 25,33,194 క్విం టాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది 22,900 మంది రైతులు నుండి 6,67,346.80 క్వింటాళ్ల పత్తిని జిల్లాలోని 18 సిసిఐ కొనుగోలు ద్వారా సేకరించ గా అదే స్థాయిలో దళారులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈసారి 14 పత్తి కొనుగోలు చేసే మిల్లుల్లో మాత్రమే సి సిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలుగా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెప్తు న్నారు. గ తేడాది కంటే రెండింతలు దిగుబ డి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో అధికారులు తగిన ముందస్తు ఏర్పాట్లు చే యడంలో విఫలమవుతున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి.
సీజన్ ప్రారంభమై సు మారు నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఈ నెలరోజులుగా దళారులు అతి తక్కువ ధరకే రైతుల నుండి పత్తిని సేకరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటా ల్కు కనీసం 7వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, ప్రస్తుతం దళారులు 5వేలు 5,200 మాత్రమే ఇస్తున్నారని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉందని సాకు చూపుతూ కొందరు వ్యాపారులు పత్తిని అగ్గువ ధరకే లాక్కుపోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఈ పరిస్థితిపై ఏ చర్యలు తీసుకోవడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదని అయినా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల ఊపులోకి పత్తి రైతులు.!
ఈసారి పత్తి రైతులు పెట్టిన పెట్టుబడిల కంటే అధికంగా అప్పుల పాలవుతున్నారు. ఒక్కో ఎకరా సాగు ఖర్చు సుమారు 50 వేల కు పైగా ఖర్చు అవుతుండగా అధిక వర్షాలు తెగుళ్లు కారణంగా ఒక్కో ఎకరా దిగుబడి 10 క్వింటాళ్ల నుండి ఐదు క్వింటాలకు తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.
దీంతో ఒక్క క్వింటా ధర దళారులు 5 వేలకు మించి ఇవ్వడం లేదని దీంతో పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు అప్పులు జమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. వీలైనంత త్వరగా ప్రభుత్వ సిసిఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పత్తి రైతుల కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌చేస్తున్నారు.