calender_icon.png 23 October, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారుల ధ్వంసంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం

17-10-2025 12:17:59 AM

-సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

-సీపీఎం ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్  సమావేశం

భద్రాచలం, అక్టోబర్ 16 (విజయక్రాంతి) ః ఇసుక లారీల విధ్వంసంతో ద్వంసమైన  జాతీయ రహదారి పునర్మానం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిపిఎం సిద్ధంగా ఉందని కలిసొచ్చే అన్ని పక్షాలను కలుపుకొని రహదారుల పునర్మించేంతవరకు నిరంతరాయ ఉద్యమాలను నిర్మించాలని, తాత్కాలికంగా ఆగిన ఇసుక లారీలను రోడ్లు బాగు చేయకుండా  మళ్లీ అనుమతిస్తే సడక్ బంద్ నిర్వహిస్తామని సిపిఐఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

గురువారం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఆవరణలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇప్పటివరకు వివిధ రాజకీయ పక్షాలు ఎవరికి వారుగా పలురూపాలలో ఉద్యమాలు నిర్వహించారని సిపిఐఎం ఆధ్వర్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండల కమిటీల నేతృత్వంలో రాస్తారోఖోలు, పాదయాత్రలు, నిర్వ హించిన ఇటు అధికారులు గానీ అటు ప్రజాప్రతిథులు గాని స్పందించడం లేదని ఈ నేపథ్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారులు నిర్మాణానికి మరో ఉద్యమానికి సిపిఐఎం శ్రీకారం చుట్టిందని మచ్చ స్పష్టం చేశారు.

కలిసొచ్చే అన్ని పక్షాలను కలుపుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పలు రూపాలలో ఉద్యమాలు నిర్వహించాలని కోరారు.   తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరు చిట్టిబాబు , కమ్యూనిస్టు మాస్ లైన్ పార్టీ నాయకురాలు  కెచ్చల కల్పన, కొండ రేట్లు సంఘం నాయకులు మురళి రమేష్, భద్రాచల పట్టణ ప్రముఖులు మాధవ రెడ్డి మాట్లాడుతూ ఇసుక లారీలు నియంత్రణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.   

భద్రాచలం డివిజన్లో ఎన్నడూ లేని విధంగా ఇసుక దోపిడీ జరుగుతుందని  ఆరోపించారు.  సమావేశంలో ప్రముఖ న్యాయవాది పామరాజు తిరుమలరావు, ప్రముఖ వ్యాపారవేత్త మల్లికార్జునరావు, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు మున్నాఫ్, జిందా రిటైర్ పెన్షన్స్ నాయకులు బందు వెంకటేశ్వర్లు, నాగభూషణం కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్  అసోసియేషన్ అధ్యక్షులు పరిమి సోమశేఖర్, బీసీ ఐక్యవేదిక డివిజన్ నాయకులు నరసింహ చారి, భద్రాచలం సొసైటీ అధ్యక్షులు అభినేని శ్రీనివాస్,మహాజన సమితి నాయకులు జి సుధాకర్ మాట్లాడుతూ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రహదారుల పునర్నిర్మాణం కోసం జరిగే ప్రతి పోరాటంలో కలిసొస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు భద్రాచలం పట్టణంలోకి లారీలు తిరగకుండా నియంత్రించాలని అధికారులను కోరాలని సూచించారు.

అనంతరం ద్వంశమైన ప్రధాన రహదారి పునర్నిర్మాణం కోసం జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని రెండు టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రేపాకుల శ్రీనివాస్, గడ్డం స్వామి, యం.చంద్రయ్య  రైతు సంఘం నాయకులు ఎలమంచిలి వంశీకృష్ణ,మచ్చ రామారావు, సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు నాయకులు ఎన్ నాగరాజు అజయ్ కుమార్, గిరిజన సంఘం నాయకులు సున్నం గంగా,కుంజా శ్రీనివాస్,  ఐద్వా నాయకులు గౌతమి, పూర్ణిమ, జీవనజ్యోతి గిరి సంఘం నాయకులు కుంజా శ్రీనివాస్ కుంజా విజయ డివైఎఫ్‌ఐ నాయకులు, పి సంతోష్ కుమార్, దారిశెట్టి సతీష్ బాబు కెవిపిఎస్ నాయకులు కోరాడ శ్రీనివాస్, రాయల రాములు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.