26-10-2025 03:30:50 PM
మంథని,(విజయక్రాంతి): రామగుండంలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ - బీనాదేవి కుమారుడు అనుదీప్ - ప్రియాంక వివాహ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సుల్తానాబాద్ లో మంథని పట్టణానికి చెందిన కొట్టే ధనలక్ష్మి - వినయ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీను బాబు వెంట మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఐ ఎన్ టి సి నాయకుడు కంపెల్లి సమ్మయ్య, మంథని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరేళ్లి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.