26-10-2025 03:27:27 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక శివాలయంలో ఆదివారం తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక వివాహాలను జరిపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 20 జంటలు ఈ వేదిక ద్వారా ఒకటయ్యాయి. వారికి పెళ్లి తంతులో ఉచితంగా పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు, బిందె, ట్రావెల్ బ్యాగ్, గోడ గడియారం, వంట కుక్కర్ ను అందజేశారు. నూతన వధూవరులతోపాటు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచిత భోజన వసతి కల్పించారు.
నూతన వధూవరులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ జెడ్పిటిసి కారుకూరి రామ్ చందర్, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి లతోపాటు పలువురు ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నూతన జంటలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం రాజన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, ఉపాధ్యక్షులు రంగు రామన్న, సభ్యులు గెల్లి జయరాం యాదవ్, ముత్తె వెంకట రాజం, గరిగవేణుగోపాల్, గరిగ రాజ్ కుమార్ లతోపాటు విరాళాలు ఇచ్చిన దాతలు, వధూవరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.