31 May, 2026 | 7:45 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

యువత రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలి..

26-10-2025 04:31 PM

నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో ఆదివారం యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కీ.శే సిలివేరు చంద్రశేఖర్, కీ.శే కంబాలపల్లి నరేష్ ల జ్ఞాపకార్ధం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని నల్లగొండ డీఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, మనం చేసే రక్తదానం ఆపద సమయాల్లో మరొకరికి సహాయపడుతుందని అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు.

రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన అని ఈ సందర్భంగా యువశక్తి యువజన సంఘంకి అభినందనలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు ఐలపురం నరేష్ మాట్లాడుతూ మా సంఘం సభ్యులు కీ.శే లు ఎస్. చంద్రశేఖర్, కె.నరేష్ ల జ్ఞాపకార్ధం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందనీ, మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. కాగా నల్లగొండ అపర్ణ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 40 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎస్కే ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి మద్దిమధు, కార్యనిర్వహక అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకన్న, కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్, కోశాధికారులు సిలివేరు పరమేష్, బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సభ్యులు ఆవుల మహేష్, నిమ్మనగోటి శ్రీనివాసు, ఏరుకొండ వెంకటేష్, సిలివేరు రిశ్వంత్, యాదాసు రామ్, బోడిగే శ్రవణ్, కంబాలపల్లి ప్రవీణ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.