బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు డమ్మీలే
l ఆర్‌ఎస్‌ఎస్ రాసిచ్చిందే చదవాలి
l కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక స్క్రిప్ట్ లీడర్
l భారత సంప్రదాయం గురించి ఆయనకు తెలియదు
l సోనియా, రాహుల్‌పై విమర్శలు సరికాదు
l పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డమ్మీగాళ్లు.. బీజేపీ కార్యాలయంలోని ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు రాసిచ్చిందే వాళ్లు మాట్లాడుతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఒక స్క్రిప్టెడ్ లీడర్. భారత సంప్రదాయం గురించి కిషన్‌రెడ్డికి తెలియదు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. బీజేపీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అర్థరహితమైన విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. సోనియాగాంధీ కుటుంబంలో ఇద్దరు పెద్దలు దేశం కోసం ప్రాణాలు కోల్పోయారని, ఆ కుటుంబం దేశ ప్రజలదని పేర్కొన్నారు.
సోనియాగాంధీ 22 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారని, ప్రధానమంత్రి కావాలనుకొంటే రెండుసార్లు అయ్యేవారని తెలిపారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం సోనియాకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా.. పీవీ నరసింహారావుకు అవకాశం ఇచ్చారని, రెండోసారి మన్మోహన్‌సింగ్‌కు పదేండ్లు ప్రధానమంత్రిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ పీవీని ప్రధాని చేయకపోతే బీజేపీ అవార్డులు ఇచ్చేదా? అని ప్రశ్నించారు. మోదీని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన బీజేపీ అగ్రనేత అద్వానినీ అణదొక్కారని ఆరోపించారు. మత విధ్వేశాలు రెచ్చగొట్టే బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం ఒక అక్షయ పాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు, ఉపాధి హామీ ద్వారా పని కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని, ఉపాధి హామీ పథకం ఒక అక్షయ పాత్ర లాంటిందని జగ్గారెడ్డి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి నిధులు కేటాయించకుండా నీరు గార్చిన మోదీ.. పేదలకు శాపంగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అధికారాన్ని పదేండ్లు ఎంజాయ్ చేశారు తప్ప, ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసి, బీజేపీకి లాభం చేకూర్చేలా బీఆర్‌ఎస్ దమ్ములేని అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉన్నదని, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికీ స్వేచ్ఛ ఉండదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రయాణం చేసి, కాంగ్రెస్ పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.






