2 May, 2026 | 6:58 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మాజీ ఏఈకి ఏడాది జైలు

28-04-2024 12:00 AM

l ఏసీబీ కేసులో కింది కోర్టు శిక్ష సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): తాను లంచం తీసుకో లేదని రూ.20 వేలు చేబదులు తీసుకుంటుంటే పోలీసులు పట్టుకుని అక్రమంగా కేసు పెట్టారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఏఈ వాదనను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఏడాది శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ కేసులో పిటిషనర్ జైలులో గడిపిన కాలాన్ని మినహాయించాలని పోలీసులను ఆదేశించింది. రోడ్డు కాంట్రాక్ట్ బిల్లుచెల్లింపులకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఆర్‌అండ్‌బీలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సోమ రాఘవేందర్, కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నేరం రుజువైనట్టు పేర్కొ న్న ఏసీబీ కోర్టు రాఘవేందర్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. 2005 నాటి ఈ కేసులో 2009లో వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.