మురికి కాలువలో చెత్త వేస్తే జరిమానా తప్పదు
బాన్సువాడ, ఆగస్టు 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో గల ప్రధాన మురికి కాలువలో చెత్త, వ్యర్థాలు వేయడం వల్ల కాలువల్లో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ వ్యాపారస్తులకు సూచించారు.
బుధవారం బాన్సువాడ పట్టణంలో కమిషనర్ గంగాధర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారులు కాలువల్లో చెత్త చెదారం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి నిబంధనల ప్రకారం జరిమానా విధించడంతో పాటు, పునరావృతంగా ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రతను కాపాడేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.






