20 August, 2026 | 1:28 AM

ముసాయిదా ఓటర్ జాబితాలో సందేహాలపై ఫిర్యాదు చేసుకోవాలి

20-08-2026 12:37 AM

సూర్యాపేట, ఆగష్టు 19 (విజయక్రాంతి): ముసాయిదా ఓటర్ జాబితాలో ఏమైనా సందేహాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులతో పోస్ట్ డ్రాఫ్ట్ కార్యకలాపాలు, డ్రాఫ్ట్ పబ్లికేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పోస్ట్ డ్రాఫ్ట్ అప్లికేషన్ అయిన తర్వాత చేయవలసిన ప్రక్రియను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రక్రియ సజావుగా జరుగుటకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, సి సెక్షన్ సూపర్డెంట్ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి సిహెచ్ రాజేశ్వరరావు,బి జె పి నుండి చల్లమల్ల నరసింహ, ఎండి హాబిద్, బి ఎస్ పి నుండి ఎం.స్టాలిన్, బిఆర్‌ఎస్ నుండి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.