17-12-2025 02:11:01 PM
ఫోన్ ద్వారా సమస్య కలెక్టర్ దృష్టికి..
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో గల డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడి నుండి తొలగించి జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు చెత్త ట్రాక్టర్లను డంపింగ్ యార్డుకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తమ గ్రామానికి సమీపంలో ఉండడంవల్ల చెత్త తగలబడి దాని ద్వారా వచ్చే దుర్వాసన, పోగా, దుమ్ము, బూడిది గ్రామస్తులపై ప్రభావం చూపుతున్నాయని చిన్నారులు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అన్నారు.
పలు మార్లు డంపింగ్ యార్డ్ ను తొలగించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, డంపింగ్ యార్డ్ ను తొలగించేంతవరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా తనకు సంబంధం లేదని తాసిల్దార్ ను అడగాలని చెప్పడంతో కలెక్టర్ దృష్టికి ఫోన్లో తీసుకువెళ్లడం జరిగింది.
ఆమె వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్, సీనియర్ నాయకులు కన్నెబోయిన మహలింగం, రుద్రవరం లింగస్వామి, దామనూరి నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రవరం దశరథ, కన్నెబోయిన శ్రీధర్, గుండాల ఉపేందర్, రుద్రవరం వంశీ, రుద్రవరం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.