17-12-2025 02:07:48 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అక్రమం మట్టి తరలింపుపై అధికారులు కపట ప్రేమను చూపిస్తున్నారు. మంగళవారం నాలుగు మట్టి ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లను బెల్లంపల్లి రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. లోడుతో పట్టుకున్న ట్రాక్టర్లపై చర్యలు లేవు. ఓనర్లపై చర్యల లేవు. మట్టి తహసిల్దార్ కార్యాలయంలోనే డంపు చేపించి వదిలేసారని తెలుస్తోంది. ఇకముందు మట్టిని అక్రమంగా తరలించమని హామీ తీసుకుని ట్రాక్టర్ల ను వదిలేసినట్టు తెలుస్తోంది.
పట్టుకున్న ట్రాక్టర్లపై చర్యలు లేకుండా వదిలేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెల్లంపల్లిలో అక్రమంగా కొంతకాలంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టి దొంగలపై అధికారుల కు అంత ప్రేమెందుకో అర్ధం కావడంలేదు. మట్టి అక్రమ దారుల పై అధికారులు తీరు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు మీడియాకు చెప్పకుండా గోప్యంగా ఉంచడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.