calender_icon.png 17 December, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సర్పంచులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం

17-12-2025 12:44:12 PM

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈనెల 20 తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నారు. మూడో విడతతో గ్రామ పంచాయతీ పోరు ముగియనున్నాయి. ఈనెల 20న కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అనంతరం సీఎం సమక్షంలో సర్పంచుల సమావేశం ఉండబోతుందని, గ్రామ అభివృద్ధి, సంక్షేమాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

అందుకు జిల్లా ఇన్ చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన జాబీతాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల్లో కలిపి 8,566 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 5,246 (61.24 శాతం) మంది అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుతోనే గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి గెలిచిన వారు ఇప్పటికే అభివృద్ధి సంక్షేమం కోణంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు.