17-12-2025 02:14:27 PM
ఉదయం 11.00 గంటల వరకు 62.35 శాతం నమోదు
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో నిర్వహిస్తున్న తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఉదయం 11.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,75,074 మంది ఓటర్లకు గాను 1,09,155 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం పోలింగ్ శాతం 62.35గా నమోదైందని తెలిపారు.
మండలాల వారీగా అల్లపల్లి మండలంలో 60.94 శాతం, గుండాల మండలంలో 71.47 శాతం, జూలూరుపాడు మండలంలో 67.41 శాతం, లక్ష్మీదేవిపల్లి మండలంలో 53.20 శాతం, సుజాతనగర్ మండలంలో 70.30 శాతం, టేకులపల్లి మండలంలో 63 శాతం, యెల్లందు మండలంలో 60.61 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే కొనసాగనున్న నేపథ్యంలో, మిగిలిన ఓటర్లందరూ ఆలస్యం చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.