17-12-2025 02:04:50 PM
హుజూర్ నగర్: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. మూడో విడతలో హుజూర్ నగర్ డివిజన్ లోని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్ నగర్, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఘటనలకు తావులేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంట సిఐ చరమంద రాజు, ఎస్సై మోహన్ బాబు,తహసిల్దార్ కవిత, తదితరులు పాల్గొన్నారు.