calender_icon.png 17 December, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

17-12-2025 01:24:20 PM

హైదరాబాద్: తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మూడో విడతలో 182 మండలాల్లోని 3,752 గ్రాంమ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి గెలిచిన అభ్యర్థుల పేర్లను సాయంత్రానికి అధికారులు వెల్లడిస్తారు.