13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

దుండిగల్ హైడ్రా ఆపరేషన్

01-04-2026 12:00 AM

150 ఫీట్ల రహదారిపై షాపుల దందాకు చెక్

హైడ్రా చర్యలకు స్థానికుల అభినందనలు

కుత్బుల్లాపూర్, మార్చి 31 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌ గండిమైసమ్మ మండలం పరిధిలో హైడ్రా ఆపరేషన్ నిర్వహించింది. బౌరంపేట్ గ్రామ పరిధిలోని గండిమైసమ్మమియాపూర్ ప్రధాన రహదారిపై అక్ర మంగా నిర్మించిన షాపులను హైడ్రా మంగళవారం తొలగించింది. 150 అడుగుల ప్రధాన రహదారికి ఇరువైపులా ఓ వ్యక్తి ఆక్రమణలకు పాల్పడి తాత్కాలిక షెడ్డులు వేసి అద్దెలకు నడుపుతున్నారని హైడ్రా కు ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులను హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. 

ఆక్రమణలతో రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించింది. ఇందులో స్క్రాప్ దుకాణాలు, ఇతర షాపుల వాళ్లకు రెండు నెలల ముందే ఖాళీ చేయాలని సూచించిన హైడ్రా రహదారిని ఆనుకుని నిర్మించిన 10 షాపులను తొలగించింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగినట్టయ్యిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారుల చర్యలను అభినందిస్తూ, రహదారిని విముక్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.