9 June, 2026 | 1:26 AM

చలో ఇందిరా పార్క్ సభను జయప్రదం చేయాలి

09-06-2026 12:00 AM

గుమ్మడిదల, జూన్ 8 : గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వార్డులో శ్రీ మణికంఠ తాపీ మేస్త్రిల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తాపీ మేస్త్రిల సమస్యలు, సంక్షేమం హక్కుల పరిరక్షణపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించనున్న ‘చలో ఇందిరా పార్క్  తాపీ మేస్త్రిల ఆత్మగౌరవ సభ‘ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తాపీ మేస్త్రిలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటాలని కోరారు. సంఘం దగ్గరి నుండి బొంతపల్లి కామన్ వద్దకు ర్యాలీగా వచ్చి అక్కడి నుండి హైదరాబాద్ కి తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ఢిల్లీశ్వరరావు, అంకమ్మరావు, శ్రీనివాసులు, శ్రీనివాస్, గోవింద్, కుమార్, కోటయ్య, లక్ష్మీనారాయణ, సభ్యులు, తాపీ మేస్త్రిలు తదితరులు పాల్గొన్నారు.