16-07-2025 12:00:00 AM
గండీడ్ జూలై 15 : మండల పరిధిలోని చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో స్వా తంత్య్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ ముక్ జయంతి ఘనంగా నిర్వహించా రు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అం గడి అరుణదేవి మాట్లాడుతూ దుర్గాబాయి దేశ్ ముక్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో 1909 జులై 15 రామారావు కృ ష్ణవేణమ్మ దంపతులకు జన్మించిందని, 8 ఏళ్ల వయసులో ఆమెకు తన మేన మామ సుబ్బారావుతో వివాహం అయిందని, ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించాలని తెలిపారు.
చిన్ననాటి నుంచే స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకుందని, ఉప్పు సత్య గ్రహంలో పాల్గొని అరెస్టు కాబడిందన్నా రు. అనేక మహిళ సంస్థలు సాంఘిక సం క్షేమ సంస్థలు ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషి చేసిందని పేర్కొన్నారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభను స్థాపించి, ఈమె సేవలు గుర్తించి ఆం ధ్ర విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ప్ర ధానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, కె.సికిందర్ విద్యార్థులు పాల్గొన్నారు.