16-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర
ములుగు, జూలై15(విజయక్రాంతి): ములుగు జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు సక్రమ చెల్లింపులద్వారా పొందిన వడ్డీ రాయితీ వివరములు ఆర్ధిక సంవత్సరం 2023-2024నకు గానుపొందిన రూ. 3.26 కోట్లరూపాయలు 4409 సంఘాలకువడ్డీ రాయితి పొందడం జరిగినదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్, 2024 నుండి జనవరి,2025 వరకురూ. 8.97 కోట్లరూపాయలు 5,233 సంఘాలకు వడ్డీ రాయితి పొందడం జరిగిందని,ఫిబ్రవరి, మార్చి,2025 వరకురూ. 1.91 కోట్లరూపాయలు 5308 సంఘాలకు వడ్డీ రాయితి పొందడం జరిగిందని,ఇందిరా మహిళా శక్తి సంబరాలలో బాగంగా 10.88 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ అందచేయడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.