calender_icon.png 5 August, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

30-11-2024 07:38:40 PM

సీపీ అభిషేక్ మొహంతి..

కరీంనగర్ (విజయక్రాంతి): నిజాయితీగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి అన్నారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కరీంనగర్ కమిషనరేట్‌కు కేటాయించిన 349 మంది కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలన్నీ విధుల్లో చేరాక ఆచరించాలన్నారు. తెలియని విషయాలను సీనియర్ల ద్వారా నేర్చుకుకోవాలని, ఇప్పుడు నేర్చుకునే అంశాలే రాబోయే 30 సంవత్సరాల తమ సర్వీసులో ఉపయోగపడతాయన్నారు. పోలీస్ యూనిఫాం కోసం ఎంత కష్టపడ్డారో ధరించాక అంతే బాధ్యతగా వ్యవహరించాలన్నారు. శిక్షణలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా పలు పోలీస్ స్టేషన్లకు కేటాయించామని, విధిగా కేటాయించబడిన పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏవో మునిరామయ్య, ఏసీపీలు శ్రీనివాస్, విజయ్‌కుమార్, ఆర్‌ఐలు రజనీకాంత్, జానిమియా, కుమారస్వామి, శ్రీదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.