calender_icon.png 16 July, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

24-06-2025 06:06:23 PM

డిఆర్డిఓ శేఖర్ రెడ్డి..

మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి సభ్యులు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డి(DRDO Sekhar Reddy) అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాలకు (సంఘబంధం) నూతన పాలకవర్గం సభ్యులు అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారిలకు శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రతి చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు ప్రతి నెల మీటింగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పొదుపు, అప్పులు పుస్తకాలు నిరంతరం పర్యవేక్షించుకోవాలని తెలిపారు.

గ్రామలలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఎస్సీఆర్పి ద్వారా అందిస్తున్న పెసెన్స్ నిధులకు సంబంధించిన కార్యక్రమాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం మోహన్ రెడ్డి, ఇంచార్జ్ ఎంపీడీవో బాస్కర్, ఏటీఎం దాసరి మైసేశ్వరరావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శి పంతంగి రాధ, బోయపర్తి యాదమ్మ, సిసిఎస్ శ్రీనివాసులు, అంజయ్య, శంకరయ్య, మల్లేశ్వరి, ఎస్సిఆర్పి, సిఆర్పి ఎస్నాగలక్ష్మి, ఉమ, మండల సమాఖ్య అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ రాణి, దుర్గ ఉన్నారు.